Ayyanna Patrudu: కాళ్లు పట్టుకోవడం అని దీనిని అంటారు.. విజయసాయికి దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu Shares Mind Blowing Pic To Vijayasai Reddy

  • అమిత్ షాను కలిసేందుకు లోకేశ్ ఎందరి కాళ్లు పట్టుకున్నాడంటూ విజయసాయి ‘ఎక్స్’
  • ప్రధాని కాళ్లను జగన్ పట్టుకున్న ఫొటోను షేర్ చేసిన అయ్యన్న
  • పట్టిన కాళ్లు.. పిసికిన పాదాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్న

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచీ వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. టీడీపీ, ఆ పార్టీ నేతలే లక్ష్యంగా సోషల్ మీడియాలో రోజుకో పోస్టు పెడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన విమర్శలను టీడీపీ నేతలు అంతే ఘాటుగా తిప్పి కొడుతున్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఫొటోను షేర్ చేసిన విజయసాయి.. షా అపాయింట్‌మెంట్ కోసం ఎందరి కాళ్లు పట్టుకున్నావు.. అని ప్రశ్నించారు.

 ప్రతిగా అయ్యన్నపాత్రుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎక్స్ వేదికగా విజయసాయిపై చెలరేగిపోయారు. ప్రధాని నరేంద్రమోదీ కాళ్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పట్టుకుంటున్నట్టు ఉన్న ఫొటోను అయ్యన్న షేర్ చేస్తూ.. కాళ్లు పట్టుకోవడం అని దీనినే అంటారని ఎద్దేవా చేశారు. బాబాయ్‌ని వేసేసిన అబ్బాయిని తప్పించేందుకు ఢిల్లీ వెళ్లి అపాయింట్‌మెంట్లు ఇప్పించేందుకు పట్టిన కాళ్లు, పిసికిన పాదాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. కన్నింగ్ పనులు చేయడం, కాళ్లు పట్టడం అలవాటైన ఏ1, ఏ2 ప్రాణాలకి ఎవరు పిలిచినా, ఎవరు కలిసినా అలాగే కనిపిస్తుంది కదా కసాయి రెడ్డీ అని తీవ్రస్థాయిలో  విరుచుకుపడ్డారు.

Ayyanna Patrudu
YSRCP
Vijayasai Reddy
TDP
Nara Lokesh

More Telugu News