Amitabh Bachchan: వైరల్ అవుతున్న అమితాబ్ 'కల్కి 2898 ఏడీ' మూవీ పోస్టర్.. స్పందించిన బిగ్ బీ

Amitabh Bachchan unveils new look from Kalki 2898 AD

  • కల్కి 2898 ఏడీ సినిమాలో నటిస్తున్న అమితాబ్
  • అభిమానుల ప్రేమాభిమానాలకు పులకించిపోయిన బిగ్‌బీ
  • బర్త్ డే నాడు అభిమానులను వ్యక్తిగతంగా కలవలేకపోయినందుకు విచారం
  • వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానున్న సినిమా

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘కల్కి 2898ఏడీ’ సినిమాలోని అమితాబ్ పోస్టర్‌ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ముఖం కనిపించకుండా, శరీరమంతా పూర్తి ఆచ్ఛాదనతో ఉన్న బిగ్ బీ.. చేతిలో దండంతో ఉన్న ఈ ఫొటో సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది. వైరల్ అవుతున్న ఈ పోస్టర్‌పై అమితాబ్ తాజాగా స్పందించారు. అభిమానుల ప్రేమాభిమానాలకు పులికించిపోతూ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, తన బర్త్‌డే నాడు అభిమానులను వ్యక్తిగతంగా కలవలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు.

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, దీపిక పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీతోపాటు యాక్షన్ డ్రామా చిత్రం ‘గణపతి: ఏ హీరో ఈజ్ బార్న్’లోనూ బిగ్ బీ నటిస్తున్నారు. దీనికి వికాశ్ బల్ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 20న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే, రజనీకాంత్ తలైవర్ 170లోనూ అమితాబ్ నటిస్తున్నారు.

Amitabh Bachchan
Kalki 2898 AD
Bollywood
  • Loading...

More Telugu News