Operation Ajay: ఆపరేషన్ అజయ్.. ఇజ్రాయెల్‌ నుంచి భారతీయులతో స్వదేశానికి చేరిన తొలి ఫ్లైట్

Operation ajay first flight lands in delhi today morning
  • శుక్రవారం ఉదయం భారతీయులతో స్వదేశంలో  దిగిన తొలి ఫ్లైట్
  • తొలి ఫ్లైట్‌లో ఇండియాకు వచ్చిన 212 మంది ప్రయాణికులు
  • ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాదర స్వాగతం
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి 212 మంది భారతీయులతో ఇజ్రాయెల్‌ నుంచి బయలుదేరిన తొలి చార్టెడ్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం భారత్‌లో దిగింది. ప్రయాణికుల్లో ఓ శిశువు కూడా ఉంది. న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన భారతీయులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాదర స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తరలింపులో మొదట వచ్చిన వారికే ప్రయాణావకాశం కల్పించేలా భారత్ ‘ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్’ విధానాన్ని అమలు చేస్తోంది. 

అంతకుమునుపు, ఆపరేషన్ అజయ్ ప్రారంభమైందంటూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ నెట్టింట పోస్ట్ పెట్టారు. భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యేందుకు విమానంలో రెడీగా ఉన్న భారతీయుల ఫొటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘తొలి విడతలో 212 మంది భారత్‌కు బయలుదేరారు’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.
Operation Ajay
Israel
Hamas

More Telugu News