Eesha Rebba: ఈషా రెబ్బా అందానికి అదృష్టం తోడుకావాలంతే!

Eesha Rebba Special

  • 2012లోనే ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా 
  • ఆశించిన స్థాయిలో దక్కని సక్సెస్ రేట్ 
  • సరైన హిట్ కోసమే వెయిటింగ్
  • తమిళ .. మలయాళ ఇండస్ట్రీలపై దృష్టి

తెలుగు నుంచి చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు. అయితే ఇతర భాషల నుంచి పొలోమంటూ దిగిపోతున్న కథానాయికల పోటీని తట్టుకోవడం వీళ్లకి కాస్త కష్టంగానే ఉంది. అయినా తమ ప్రత్యేకతను చాటుకోవడానికి .. తమని వెతుక్కుంటూ అవకాశాలు రావడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి తెలుగు హీరోయిన్స్ జాబితాలో ఈషా రెబ్బా కూడా కనిపిస్తుంది. ఈషా రెబ్బా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లయింది. అయితే ఈ పదేళ్లలో ఆమె  చేయవలసినన్ని సినిమాలు చేయలేదనే చెప్పాలి. ఈషా రెబ్బా పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ చేయడం .. మెయిన్ రోల్స్ చేసిన చిన్న సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన సహజంగానే ఆమె వెనకబడిపోవడానికి కారణమని చెప్పుకోవాలి. రీసెంటుగా సుధీర్ బాబుతో కలిసి చేసిన సినిమా కూడా పరాజయం పాలైంది. ఒక వైపున తెలుగులో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూనే, మరో వైపున తమిళ .. మలయాళ సినిమాల్లోను ఈషా రెబ్బా గట్టిగానే ట్రై చేస్తోంది. నిజానికి ఈషా రెబ్బా హాట్ లుక్స్ ను ఇష్టపడే కుర్రాళ్లు చాలామంది ఉన్నారు. ఇక అభినయం పరంగా కూడా ఆమెకి వంక బెట్టడానికి లేదు. ఎటొచ్చి సరైన హిట్ పడాలంతే. అలాంటి హిట్ ఈ మూడు భాషల్లో ఏ వైపు నుంచి వచ్చినా, ఆమె కెరియర్ గ్రాఫ్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. 

Eesha Rebba
Actress
Tollywood
  • Loading...

More Telugu News