Nara Lokesh: అమిత్ షా నన్ను కలవాలనుకుంటున్నట్లు కిషన్ రెడ్డి ఫోన్ చేశారు: నారా లోకేశ్

Nara Lokesh about meeting with Amit Shah

  • అమిత్ షాకు అన్ని విషయాలు చెప్పానన్న టీడీపీ యువనేత
  • చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పినట్లు వెల్లడి
  • సీఐడీ ఎందుకు పిలిచింది, ఎన్ని కేసులు పెట్టిందని అమిత్ షా ఆరా తీశారన్న లోకేశ్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలవాలనుకుంటున్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఆయన మధ్యాహ్నం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... అమిత్ షాకు అన్ని విషయాలు వివరించినట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పానన్నారు. జైల్లో ఉన్న తమ పార్టీ అధినేతకు భద్రతాపరంగా ఉన్న ఆందోళనను అమిత్ షాకు చెప్పానన్నారు.

సీఐడీ ఎందుకు పిలిచింది, ఎన్ని కేసులు పెట్టిందని తనను అడిగారన్నారు. తమపై రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టినట్లు తాను అమిత్ షాకు వివరించానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. సీఎంగా జగన్ చేసిన ఒక్క మంచి పని లేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను జగన్ ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

Nara Lokesh
Amit Shah
BJP
Telugudesam
G. Kishan Reddy
  • Loading...

More Telugu News