Ganta Srinivasa Rao: వారేం చెబితే పురందేశ్వరి అదే చేస్తారు: మాజీ మంత్రి గంటా

Ganta Srinivasa rao on purandeswari

  • వైసీపీ నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శ
  • చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఉంటుందన్న గంటా
  • బీజేపీ తమతో ఎంత వరకు కలిసి వస్తుందో కాలం నిర్ణయిస్తుందన్న మాజీ మంత్రి

వైసీపీ నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వారి పార్టీ అధినాయకత్వం ఏం చెబితే అదే చేస్తారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుందన్నారు. టీడీపీ, జనసేన, సీపీఐ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ తమతో ఎంత వరకు కలిసి వస్తుందనేది కాలం నిర్ణయిస్తుందన్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే లక్ష్యం కోసం పని చేసే అన్ని పార్టీలు కలుస్తాయని గంటా వ్యాఖ్యానించారు. దసరా నాటికి ముఖ్యమంత్రి జగన్ విశాఖ రావాలని భావిస్తున్నారని, ఈ క్రమంలో ప్రభుత్వం దొంగ జీవో విడుదల చేసిందని ధ్వజమెత్తారు. ఈ జవో ఇచ్చిన అధికారులు సిగ్గుపడాలన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి వారికి ఎన్నికల ముందు ఇప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Ganta Srinivasa Rao
Daggubati Purandeswari
Telangana Assembly Election
Chandrababu
  • Loading...

More Telugu News