Nayanthara: సమంతకు ప్రత్యేక గిఫ్ట్ పంపిన నయనతార

Nayanathara sends special gift to Samantha

  • ఇటీవల 9 స్కిన్ పేరుతో కాస్మొటిక్స్ బిజినెస్ ను ప్రారంభించిన నయనతార
  • సామ్ కు బ్యూటీ ప్రాడక్ట్స్ ను పంపిన నయన్
  • వీటిని వాడటానికి ఆసక్తిగా ఉన్నానన్న సమంత

దక్షిణాది సినీ పరిశ్రమలో నయనతార, సమంతలది ఒక ప్రత్యేక స్థానం. నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నా యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ వారు దూసుకుపోతున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ సమంతకు నయనతార ఒక ప్రత్యేక బహుమతిని పంపించింది. 

నయనతార ఇటీవల ఒక కొత్త బిజినెస్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. '9 స్కిన్' అనే కాస్మొటిక్స్ బిజినెస్ ను ప్రారంభించింది. ఈ కంపెనీ ద్వారా బ్యూటీ ప్రాడక్ట్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాడక్ట్స్ ను తానే స్వయంగా ప్రమోట్ చేస్తోంది. తాజాగా సమంతకు 9 స్కిన్ నుంచి ఫేస్ క్రీమ్ ప్రాడక్ట్స్ ను పంపించింది. ఈ విషయాన్ని ఇన్స్టా ద్వారా సమంత వెల్లడించింది. ఈ ప్రాడక్ట్స్ ని వాడటానికి తాను ఆసక్తిగా ఉన్నానని సామ్ తెలిపింది. 9 స్కిన్ కంపెనీకి ఆల్ ది బెస్ట్ చెప్పింది.

Nayanthara
Samantha
Gift
Tollywood
Bollywood
Kollywood
  • Loading...

More Telugu News