Rohit Sharma: పాకిస్థాన్ తో పోరుకు సిద్ధమైన టీమిండియా... రోహిత్ శర్మ స్పందన

Rohit Sharma opines on crucial match against Pakistan
  • వరల్డ్ కప్ లో టీమిండియాకు వరుసగా రెండు విజయాలు
  • మూడో మ్యాచ్ లో పాకిస్థాన్ తో అమీతుమీ
  • అక్టోబరు 14న అహ్మదాబాద్ లో మ్యాచ్
వరల్డ్ కప్ లో వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా మూడో మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబరు 14న అహ్మదాబాద్ లో జరగనుంది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ పై విజయం అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. 

పాకిస్థాన్ తో మ్యాచ్ తమకు ఎంతో కీలకం అని వెల్లడించాడు. అయితే ఈ మ్యాచ్ గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతోంది అనేది తాము పట్టించుకోవడంలేదని స్పష్టం చేశాడు. తమ పరిధిలో తాము ఏం చేయగలమో, తాము నియంత్రించగల విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో పిచ్ అంశంపై, మెరుగ్గా ఆడడంపై, జట్టు కూర్పుపై దృష్టి సారిస్తామని వెల్లడించాడు.
Rohit Sharma
Team India
Pakistan
Ahmedabad
World Cup

More Telugu News