Mahesh Babu: మహేశ్ బాబు 'సూట్ చెక్'... ఫొటో ఇదిగో!

Mahesh Babu latest pic went viral

  • గ్లామర్ కు పర్యాయపదంలా మహేశ్ బాబు
  • తాజాగా సూట్ ధరించి ఫొటో షూట్
  • సామాజిక మాధ్యమాల్లో ఫొటో వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎవర్ గ్రీన్ అందంతో వయసుకు సవాల్ విసురుతుంటారు. సినిమాల్లోనే కాదు, పలు ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసే విషయంలోనూ ఆయన గ్లామర్ విషయంలో ఏ మాత్రం రాజీపడరు. తండ్రి నుంచి సహజ సౌందర్యాన్ని అందిపుచ్చుకున్న మహేశ్ బాబు తన క్రమశిక్షణ, వ్యాయామం, ఆహారపు అలవాట్లతో దాన్ని మరింత కాపాడుకుంటూ వస్తున్నారు. 

తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటో చూస్తే "వావ్" అనకుండా ఉండలేరు. సూటు ధరించి, షార్ప్ లుక్స్ తో ఎంతో రాయల్ గా కనిపిస్తున్న మహేశ్ బాబును ఆ ఫొటోలో చూడొచ్చు. తన ఫొటో పట్ల 'సూట్ చెక్' అంటూ మహేశ్ బాబు స్పందించారు. మహేశ్ బాబు ఎక్స్ లో ఈ పిక్ ను పంచుకున్న కాసేపట్లోనే లైకులు, రీపోస్టులు వెల్లువెత్తాయి.

Mahesh Babu
Suit
Actor
Superstar
Tollywood

More Telugu News