Pakistan: టీమిండియాతో వరల్డ్ కప్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న పాకిస్థాన్ జట్టు... వీడియో ఇదిగో!

Pakistan team arrives Ahmedabad

  • వరల్డ్ కప్ లో ఈ నెల 14న దాయాదుల సమరం
  • భారత్-పాక్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రపంచం
  • రేపు అహ్మదాబాద్ చేరుకోనున్న టీమిండియా

వరల్డ్ కప్ లో అక్టోబరు 14న టీమిండియా, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోందనడంలో సందేహంలేదు. పైగా, ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. 1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం దాయాదుల సమరం నేపథ్యంలో పూర్తిగా నిండిపోనుంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. నిన్న హైదరాబాదులో శ్రీలంకతో మ్యాచ్ ఆడిన పాకిస్థాన్ జట్టు... ఇవాళ అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది. ఇక, ఢిల్లీలో నేడు ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ ఆడుతున్న టీమిండియా కూడా రేపు అహ్మదాబాద్ చేరుకోనున్నట్టు తెలుస్తోంది.

Pakistan
Team India
Ahmedabad
Narendra Modi Stadium
ICC World Cup

More Telugu News