Rajasthan: నవంబర్ 23న పెళ్లిళ్లు, శుభకార్యాలు: రాజస్థాన్‌లో ఏకంగా పోలింగ్ తేదీని మార్చిన ఈసీ

EC changes Rajasthan polling date to November 25

  • రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
  • 23న దేవ్ ఉతానీ ఏకాదశి కారణంగా ఓటింగ్ శాతం తగ్గుతుందన్న పార్టీలు
  • పోలింగ్ తేదీని 25కు మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం

రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని మార్చింది. షెడ్యూల్ ప్రకారం రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 23న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఆ రోజున దేవ్ ఉతానీ ఏకాదశి కారణంగా బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ఈసీకి లేఖ రాశాయి. ఆ రోజున పెద్ద ఎత్తున పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయని, ఆ రోజున పోలింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం భారీగా తగ్గుతుందని, కాబట్టి మరో తేదీని పోలింగ్ కోసం ప్రకటించాలని కోరాయి. ఈ మేరకు ఈసీకి లేఖ రాశాయి. పార్టీల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ పోలింగ్ తేదీని నవంబర్ 23కు బదులు నవంబర్ 25కు మార్చింది. 

నవంబర్ 23న రాజస్థాన్‌లో 50,000కు పైగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. ఈ సమయంలో శుభకార్యాలకు అటెండ్ అయ్యేవారు, వ్యాపారం కోసం చూసేవారు ఓటు వేసేందుకు మొగ్గు చూపకపోవచ్చు. అందుకే ఈసీ కూడా పార్టీల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని, పోలింగ్ తేదీని మార్చింది.

Rajasthan
cec
election commission
  • Loading...

More Telugu News