tiger nageswara rao: 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా నిర్మాత కార్యాలయంలో ఐటీ సోదాలు

IT searches in tiger Nageswara Rao cineme producer office

  • నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ సోదాలు
  • టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు కొన్నిరోజుల ముందు సోదాలు
  • గతంలో కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ- సినిమాలను నిర్మించిన అభిషేక్

ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో బుధవారం ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. లావాదేవీలు, పన్ను చెల్లింపుల రికార్డులను ఐటీ అధికారులు పరిశీలించారు. రవితేజ హీరోగా విడుదలకు సిద్ధంగా ఉన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని అభిషేక్ నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ నిర్మాత ఇంతకుముందు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2, ధమాకా సినిమాలను నిర్మించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నిర్మాత అభిషేక్ కార్యాలయంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

tiger nageswara rao
Raviteja
Tollywood
  • Loading...

More Telugu News