Team India: వరల్డ్ కప్ లో నేడు టీమిండియా మ్యాచ్... టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్

Team India takes on Afghanistan in ongoing world today

  • వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా × ఆఫ్ఘనిస్థాన్
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • టీమిండియాలో అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్

వరల్డ్ కప్ లో టీమిండియా నేడు రెండో మ్యాచ్ ఆడుతోంది. టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగే ఈ పోరుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను పక్కనబెట్టిన టీమిండియా మేనేజ్ మెంట్... మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకుంది. అటు, ఆఫ్ఘనిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. టీమిండియా వరల్డ్ కప్ లో తన తొలి మ్యాచ్ లో ఆసీస్ పై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్ తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.

More Telugu News