healthy Eyes: కంటికి కళ్లద్దాలు రాకుండా ఉండాలంటే..?

Tips To Keep Your Eyes Healthy As You Age

  • ముందస్తు వైద్య పరీక్షలు తప్పనిసరి
  • పోషకాహారాన్ని తీసుకోవాలి
  • పొగతాగడం మానివేయాలి 
  • బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ అవసరం

సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కంటి చూపు ఉన్నప్పుడే కదా ఈ ప్రపంచాన్ని వీక్షించగలం. కంటి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. పోషకాహారం తీసుకోవడం ద్వారా కళ్లను పదిలంగా కాపాడుకోవచ్చు. పోషకాల లేమి, వయసు ప్రభావంతో కంటి చూపు తగ్గిపోవడం మామూలే. దీనికితోడు క్యాటరాక్ట్ (శుక్లం) సమస్య కూడా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుంది. ఇప్పుడు రెటీనా సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెటీనాకి చికిత్స లేదు. గ్లకోమా (నీటి కాసులు) కూడా కంటిచూపును దెబ్బతీసే నిద్రాణ మహమ్మారి. గ్లకోమా ఉన్నట్టు బయటకు తెలియదు. అందుకే ఏడాదికోసారి అయినా కళ్లకు పరీక్ష చేయించుకోవడం అవసరం.

ఏటా పరీక్షలు
కంటి చూపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకపోయినా, ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నది వైద్యుల సూచన. కుటుంబం చరిత్రలో ఎవరికైనా గ్లకోమా ఉంటే, 40 ఏళ్ల తర్వాత ఏడాదికోసారి తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల కంటి సమస్యలను ఆరంభంలోనే గుర్తించొచ్చు. ఇది చికిత్సను సులభం చేస్తుంది. సాధారణంగా 40 దాటిన తర్వాత నుంచి చూపులోనూ సమస్యలు వస్తుంటాయి. వైద్యులు పవర్ గ్లాస్ సూచిస్తే వాటిని తప్పకుండా వాడడం మంచిది. ప్రతి రెండేళ్లకు ఒకసారి సమగ్ర కంటి పరిశీలన చేయించుకోవాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ అప్తమాలజీ సూచన. ఎదుట ఉన్న ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంటే వైద్యులను సంప్రదించాలి. 

మార్పులు అవసరంఆహారంలో విటమిన్లు ఏ, సీ, ఈ, మినరల్స్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, ముడి ధాన్యాలు తీసుకోవచ్చు. సూర్యుడి అల్ట్రా వయలెట్ కిరణాలు కంటి చూపును దెబ్బతీస్తాయి. దీంతో క్యాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్ రిస్క్ పెరుగుతుంది. అందుకే బయటకు వెళ్లే సమయంలో అల్ట్రా వయలెట్ కిరణాల నుంచి రక్షణగా సన్ గ్లాసెస్ ధరించాలి. తలకు క్యాప్ ధరించడం ద్వారా కొంత రక్షణ కల్పించుకోవచ్చు. పొగతాగే అలవాటుతో కంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కంటిలో శుక్లం ఏర్పడడం, మాక్యులర్ డీజనరేషన్, గ్లకోమా సమస్యలు ఎదురవుతాయి. పొగతాగే అలవాటు మానివేయడం కంటి చూపు బాగుండాలని కోరుకునే వారు ముందు చేయాల్సిన పని. మధుమేహం, రక్తపోటు కూడా కంటి చూపును దెబ్బతీసే జీవనశైలి వ్యాధులు. డయాబెటిక్ రెటీనోపతి, హైపర్ టెన్సివ్ రెటీనోపతి ఏర్పడే రిస్క్ పెరుగుతుంది. అందుకని ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.

ఇవి చేయాలి..
  • నేడు కంప్యూటర్లు మొబైల్ ఫోన్లపై అధిక సమయం గుడుపుతున్నారు. స్క్రీన్లను చూస్తున్న సమయంలో కనీసం కళ్లను ఆర్పడం కూడా మర్చిపోతుంటారు. దీంతో కళ్లు పొడిబారతాయి. ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో 20 సెకండ్ల పాటు చూడాలి.
  • సరిపడా నిద్ర లేకపోతే కళ్లు ఎర్రగా మారిపోతాయి. రోజులో కనీసం 6-8 గంట నిద్ర ఉండేలా చూసుకోవాలి.
  • కళ్లను నలుపకూడదు. దీనివల్ల సున్నితమైన లేయర్లు దెబ్బతింటాయి. ఏడాదికోసారి కళ్లద్దాలను మార్చుకోవాలి.

  • Loading...

More Telugu News