Gayathri Bharadwaj: తెలుగు తెరకు పరిచయమవుతున్న ఢిల్లీ బ్యూటీ!

Gayatthri Bharadwaj Special

  • వెబ్ సిరీస్ లతో బిజీగా 'గాయత్రి భరద్వాజ్'
  • హిందీలో చేసిన 'ఇట్టు సి బాత్'
  • రవితేజ జోడీగా చేసిన 'టైగర్ నాగేశ్వరరావు'
  • తెలుగులో ఆమె ఫస్టు మూవీ ఇదే

తెలుగు తెరపై ఎక్కువగా కేరళ భామల జోరు కొనసాగుతూ వస్తోంది. ఇక అడపా దడపా ఢిల్లీ బ్యూటీల సందడి కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి ప్రేక్షకుల మనసులను దోచుకున్న వారి జాబితాలో తాప్సీ .. రకుల్ .. రాశి ఖన్నా .. కేతిక శర్మ తదితరులు కనిపిస్తారు. 

అదే బాటలో ఇప్పుడు ఢిల్లీ నుంచి మరో బ్యూటీ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది .. ఆ సుందరి పేరే గాయత్రి భరద్వాజ్.  తెలుగులో ఆమె మొదటిసారిగా చేసిన సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. రవితేజ సరసన నాయికగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 20వ తేదీన విడుదలవుతోంది. 

గాయత్రి భరద్వాజ్ ఇంతకుముందు హిందీలో 'ఇట్టు సి బాత్' చేసింది. క్రికెట్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. వెబ్ సిరీస్ లను మాత్రం గ్యాప్ లేకుండా చేసుకుంటూ వెళుతోంది. అవే ఆమెకి సినిమా ఛాన్సులు కూడా తెచ్చిపెడుతున్నాయి. 'టైగర్ నాగేశ్వరరావు' హిట్ అయితే, ఈ బ్యూటీ ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Gayathri Bharadwaj
Raviteja
Actress
  • Loading...

More Telugu News