Nayanatara: తెలుగు ఆడియన్స్ ముందుకు నయనతార 'గాడ్' .. భయపెట్టే సైకలాజికల్ థ్రిల్లర్!

God movie update

  • తమిళంలో క్రితం నెలలో విడుదలైన 'ఇరైవన్'
  • తెలుగులో 'గాడ్' టైటిల్ తో ఈ నెల 13న రిలీజ్
  • సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ 
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న జయం రవి

నయనతార ఇంతవరకూ చాలా హారర్ థ్రిల్లర్ ... సస్పెన్స్ థిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చేసింది. వాటిలో సక్సెస్ అయిన సినిమాల సంఖ్య ఎక్కువ. అలాంటి నయనతార నుంచి ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 'ఇరైవన్' టైటిల్ తో హిట్ కొట్టిన ఆ సినిమానే ఇప్పుడు 'గాడ్' టైటిల్ తో తెలుగులో వస్తోంది. 

తమిళంలో సెప్టెంబర్ 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. జయంరవి - నయనతార జంటగా నటించిన ఈ సినిమా, ఇక్కడ ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ .. ఇది ఏ స్థాయిలో భయపెట్టనుందో చెప్పేసింది. 

అర్జున్ (జయం రవి) ఓ పోలీస్ ఆఫీసర్. అతను కొంతమంది క్రిమినల్స్ ను జైలు నుంచి రిలీజ్ చేస్తాడు. వాళ్లలో టీనేజ్ అమ్మాయిలను వరుసగా చంపుకుంటూ వెళ్లే సీరియల్ కిల్లర్ కూడా ఉంటాడు. అతనికీ .. అర్జున్ కి మధ్య ఈ కథ నడుస్తుంది. ఈ తరహా జోనర్లో నయన్ నుంచి కొంత గ్యాప్ తరువాత వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందనేది చూడాలి. 

Nayanatara
Jayam Ravi
Rahul Bose
God Movie
  • Loading...

More Telugu News