Dhanush: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దూసుకుపోతున్న ధనుశ్ మూవీ!

Thiru Chithrambalam movie update

  • తమిళంలో హిట్ కొట్టిన సినిమా 
  • తెలుగులో థియేటర్స్ నుంచి రాని రెస్పాన్స్
  • ఈ నెల 6 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 
  • అనూహ్యమైన రెస్పాన్స్ ను అందుకుంటున్న లవ్ స్టోరీ  

సినిమా గురించి తప్ప మరి దేని గురించి ఆలోచన చేయని హీరోలలో ధనుశ్ కూడా కనిపిస్తాడు. ఒకదాని తరువాత ఒకటిగా ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటాడు. సాధ్యమైనంత వరకూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటాడు. అలాంటి ధనుశ్ నుంచి క్రితం ఏడాది 'తిరు చిత్రంబళం' వచ్చింది. 

మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ధనుశ్ సరసన నిత్యామీనన్ .. రాశి ఖన్నా .. ప్రియా భవాని శంకర్ నటించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, తెలుగులో 'తిరు' పేరుతో విడుదలైందిగానీ, సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 

ఈ ప్రేమకథా చిత్రానికి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. ఒకే కాలనీలో .. పక్కపక్కనే ఉన్న ఇళ్లలో తిరు - శోభన ఉంటారు. తిరూ వేరే అమ్మాయిలను లైన్లో పెట్టడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ విషయంలో శోభననే ఐడియాలు అడుగుతూ ఉంటాడు. అందువలన తన ప్రేమను ఆమె చెప్పలేకపోతుంది. తీరా ఆమె దూరమైపోయిన తరువాత, తన పట్ల ఆమెకి గల ప్రేమను గురించి తిరు తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడనేదే కథ. 

Dhanush
Nithya Menen
Mithran
  • Loading...

More Telugu News