Revanth Reddy: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy key comments alliance

  • పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయన్న రేవంత్ రెడ్డి
  • అభ్యర్థుల ఎంపిక విషయంలో మీడియా కాస్త సంయమనం పాటించాలని సూచన
  • పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్లతో పాటు అనేక పదవులు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వార్తలపై మీడియా కాస్త సంయమనం పాటించాలని కోరారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తమ పార్టీకి ఓ విధానం ఉందని, అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాక అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు.

ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే టిక్కెట్లకు సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కానీ ఇంకా ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర పదవులు... అనేక అవకాశాలు తమ పార్టీ నేతలకు ఉన్నాయన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

కొందరు అధికారులు అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. తాము బీఆర్ఎస్ అనుకూల అధికారుల వివరాల సేకరణ కోసం కమిటీని నియమించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు వార్తలు రాస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఓటర్లకు నిధులు విడుదల చేయకూడదన్నారు. చాలామంది అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

Revanth Reddy
Congress
BRS
Telangana Assembly Election
  • Loading...

More Telugu News