Ramcharan: దిల్ రాజును పరామర్శించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Ram Charan visits Dil Raju house

  • నిన్న కన్నుమూసిన దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి
  • దిల్ రాజును పరామర్శిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
  • దిల్ రాజు నివాసానికి వెళ్లి పరామర్శించిన మెగా పవర్ స్టార్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డి చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఈ రోజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిల్ రాజును పరామర్శిస్తున్నారు.

అంత్యక్రియల్లో నటుడు ప్రకాశ్ రాజ్ సహా పలువురు పాల్గొన్నారు. ప్రకాశ్ రాజ్‌ను చూసిన దిల్ రాజు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా దిల్ రాజు ఇంటికి వెళ్లి పరామర్శించారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా అనుసంధాన వేదికగా సంతాపం తెలిపారు.

Ramcharan
Dil Raju
Tollywood
  • Loading...

More Telugu News