Trisha: అది ప్రమాదమా? హత్యనా? : త్రిష నటించిన 'ది రోడ్' కథ ఇదే!

The Road MovieUpdate

  • నాయిక ప్రధానమైన కథలతో బిజీగా త్రిష 
  • రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన 'ది రోడ్'
  • క్రైమ్ తో కూడిన మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • హైలైట్ గా నిలిచిన త్రిష నటన

తమిళంలో త్రిష లేడీ ఓరియెంటెడ్ సినిమాలను వరుసగా చేస్తూ వెళుతోంది. అలా తమిళంలో ఆమె చేసిన 'ది రోడ్' సినిమా అక్కడ ఈ నెల 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ నిర్మించిన ఈ సినిమాకి అరుణ్ వశీగరన్ దర్శకత్వం వహించాడు. మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 

ఈ సినిమాలో త్రిష 'మీరా' పాత్రలో కనిపిస్తుంది. మీరా భర్త .. ఆమె కొడుకు ఇద్దరూ కూడా సరదా ట్రిప్ గా కార్లో కొడైకెనాల్ వెళతారు. అక్కడ జరిగిన ఒక ప్రమాదంలో వాళ్లిద్దరూ చనిపోతారు. ఊహించని ఈ సంఘటనతో మీరా బిత్తరపోతుంది. ఆ కేసుకి సంబంధించిన విచారణ కొనసాగుతూ ఉండగానే, అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదేమో అనే అనుమానం ఆమెకి కలుగుతుంది. 

దాంతో ప్రమాదం జరిగిన తీరును అనేక కోణాల్లో ఆమె పరిశీలించడం జరుగుతుంది. కచ్చితంగా అది ప్రమాదం కాదనే విషయం మీరాకి అర్థమైపోతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె భర్త .. కొడుకు చనిపోవడం వెనుక ఎవరున్నారు? తను నమ్మిన విషయాన్ని ఆమె నిరూపించగలుగుతుందా? అనేదే కథ. సింపుల్ లైన్ అయినప్పటికీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Trisha
Shabeer Kallarakkal
Santhosh Prathap
Miya George
The Road
  • Loading...

More Telugu News