Roshan: యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో 'బబుల్ గమ్' .. టీజర్ రిలీజ్!

Bubble Gum movie teaser released

  • హీరోగా సుమ కనకాల తనయుడు రోషన్ 
  • 'బబుల్ గమ్' సినిమాతో పరిచయం
  • హీరోయిన్ గా మానస ఎంట్రీ 
  • సంగీతాన్ని అందిస్తున్న శ్రీచరణ్ పాకాల

నటుడిగా రాజీవ్ కనకాల .. యాంకర్ గా సుమ చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వారి తనయుడు రోషన్ ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నాడు. మహేశ్వరీ మూవీస్ - పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 'క్షణం' సినిమాతో పేరు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు ఈ సినిమాకి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. 

రోషన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి 'బబుల్ గమ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రీసెంటుగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రాజమౌళి రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రోషన్ లుక్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 

హీరో- హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలను కవర్ చేశారు. ఈ సినిమాలో రోషన్ సరసన నాయికగా 'మానస' నటిస్తోంది. ఆమెకి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News