Israel Cops: హమాస్ మిలిటెంట్లను సినీఫక్కీలో మట్టుబెట్టిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో ఇదిగో!

Israel Cops Dramatic Bike Chase Shootout Near Gaza Border
  • గాజా బార్డర్ లో కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఛేజ్ చేసిన పోలీసులు
  • బైక్ తో వెంటాడుతూనే కాల్పులు జరిపిన వైనం
  • ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు వెల్లడి
ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లను పోలీసులు ఏరివేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టులను కనిపించిన చోటే కాల్చిపడేస్తున్నారు. ఈ క్రమంలో గాజా బార్డర్ లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు పోలీసుల దృష్టిలో పడ్డారు. ఓ కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేశారు. ఓ కారులో ఇద్దరు పోలీసులతో పాటు బైక్ పై మరో ఆఫీసర్ వారిని వెంటాడారు. మిలిటెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనే దృఢ నిశ్చయంతో హైవేపై దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ ఒక చేత్తో బైక్ నడుపుతూనే మరో చేతితో మిలిటెంట్లపై కాల్పులు జరిపాడు.

పలు రౌండ్లు కాల్పులు జరపగా.. కారు నడుపుతున్న మిలిటెంట్ కు బుల్లెట్ తగిలినట్లు కనిపించింది. ఆ తర్వాత కాసేపటికే మిలిటెంట్లు ఉన్న కారు రోడ్డు పక్కన ఆగింది. అయినా పోలీసులు కాల్పులు ఆపలేదు. బైక్ తో వెంటాడిన పోలీస్ ఆఫీసర్ తో పాటు కారులో వచ్చిన మరో ఇద్దరు పోలీసులు పలు రౌండ్లు కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు. ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Israel Cops
Dramatic Bike Chase
Shootout
Gaza Border
Hamas Militents

More Telugu News