Ramayan: రామాయణం కోసం ఆల్కహాల్, మద్యానికి దూరం కానున్న రణబీర్ కపూర్

Ranbir Kapoor To STOP Drinking and Eating Meat for Ramayan Wants To Feel As Pure As Ram Report

  • రామాయణం సినిమాలో రాముడి పాత్ర పోషించనున్న రణబీర్
  • రాముడి మాదిరిగా స్వచ్ఛంగా ఉండాలనే భావన
  • అందుకే మద్యం, మాంసాదులకు దూరంగా ఉండాలన్న నిర్ణయం

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ మద్యం, మాంసానికి దూరంగా ఉండనున్నారు. ఎందుకు అని అనుకుంటున్నారా? నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రం కోసం రాముడి పాత్రను రణబీర్ పోషించనున్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నందున, పవిత్రంగా ఉండాలనే ఆలోచనతో రణబీర్ కపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ విషయం తెలిసిన వర్గాలు తెలిపాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన దక్షిణాది నటి సాయి పల్లవి నటించనుంది. ప్రజల్లో పరపతి కోసం రణబీర్ కపూర్ మద్యం, మాంసానికి దూరంగా ఉండడం లేదని, కేవలం రాముడి పాత్ర కోసమే ఆ పని చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రామాయణం సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదిలో మొదలు కానుంది. ఫిబ్రవరి నుంచి రణబీర్, సాయి పల్లవితో కూడిన షాట్లు తీయనున్నట్టు తెలుస్తోంది. ఆగస్ట్ వరకు ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. వీఎఫ్ఎక్స్ సేవలను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కంపెనీ డీఎన్ఈజీ అందించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News