Gold Rates: ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. కారణం ఇదే!

Gold rates raised in a single day

  • ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు
  • తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200
  • 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,350

ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే గోల్డ్ రేట్స్ ఊహించనంతగా పెరిగాయి. ఇజ్రెయెల్-పాలస్తీనాల మధ్య కొనసాగుతున్న యుద్ధమే దీనికి కారణం. నిన్న ప్రారంభ ట్రేడింగ్ లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 440 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. నిన్నటి మార్కెట్ తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర మరో రూ. 220 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 

ఇతర నగరాల్లో బంగారం ధరలు:
  • విజయవాడ: 24 క్యారెట్లు - రూ. 58,200.. 22 క్యారెట్లు - 53,350
  • విశాఖపట్నం: 24 క్యారెట్లు - 58,200.. 22 క్యారెట్లు - రూ. 53,350
  • బెంగళూరు: 24 క్యారెట్లు - 58,200.. 22 క్యారెట్లు - రూ. 53,350
  • చెన్నై: 24 క్యారెట్లు - 58,530.. 22 క్యారెట్లు - రూ. 53,650
  • ఢిల్లీ: 24 క్యారెట్లు - 58,350.. 22 క్యారెట్లు - రూ. 53,500.

మరోవైపు వెండి ధరలకు కూడా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 72,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర రూ. 500 పెరిగింది.

Gold Rates
Hyderabad
Vizag
Vijayawada
  • Loading...

More Telugu News