Telangana: తెలంగాణలో ఎన్నికల కోడ్...హైదరాబాద్‌లో భారీగా బంగారం, వెండి పట్టివేత

Gold and silver seizes in hyderabad

  • తెలంగాణలో అమల్లోకి ఎన్నికల నియమావళి
  • హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు, అధికారుల ముమ్మర తనిఖీలు
  • చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదున్నర కిలోల బంగారం పట్టివేత
  • నిజాం కాలేజీ సమీపంలో ఏడు కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన రావడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు, అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు చూపించని నగదును, బంగారాన్ని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్‌లో పోలీసులు 5.65 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

నిజాం కాలేజీ సమీపంలో గేట్ నెంబర్ 1 వద్ద 7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 300 కిలోల వెండిని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఫిలింనగర్ పరిధిలోని నారాయణమ్మ కాలేజీ సమీపంలో ఓ కారులో ఎలాంటి రసీదు లేని రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోను పెద్ద మొత్తంలో నగదు, బంగారం, అక్రమ మద్యం వంటి వాటిని పట్టుకున్నారు.

Telangana
Telangana Assembly Election
gold
  • Loading...

More Telugu News