Team India: "పాకిస్థాన్ తో మ్యాచ్ కు టీమిండియాకు కొత్త డ్రెస్సు"... అంటూ జరుగుతున్న ప్రచారంపై బీసీసీఐ స్పందన

BCCI reacts to speculations on new kit for Team India in world cup clash against Pakistan

  • ప్రాక్టీసులో ఆరెంజ్ కిట్ తో కనిపించిన టీమిండియా
  • మీడియా సమావేశానికి ఆరెంజ్ జెర్సీతో వచ్చిన రోహిత్
  • దాంతో టీమిండియా జెర్సీ మారిందంటూ ప్రచారం
  • ఒక్క మ్యాచ్ కోసం కిట్ ను మార్చడం జరగదన్న బీసీసీఐ

టీమిండియాకు, బ్లూ రంగుకు విడదీయరాని సంబంధం ఉంది. ఎప్పట్నించో టీమిండియా బ్లూ జెర్సీలతోనే బరిలో దిగుతోంది. అయితే, వరల్డ్ కప్ లో ప్రాక్టీసు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ఆరెంజ్ కలర్ జెర్సీలతో కనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం మీడియా సమావేశానికి ఆరెంజ్ డ్రెస్సుతోనే వచ్చాడు. దాంతో, పాకిస్థాన్ తో మ్యాచ్ కోసం భారత జట్టు ఆరెంజ్ జెర్సీలతో బరిలో దిగనుందని ప్రచారం మొదలైంది. దీనిపై బీసీసీఐ స్పందించింది.

టీమిండియా జెర్సీలపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. అవన్నీ ఒట్టి ఊహాగానాలేనని కొట్టిపారేసింది. కేవలం ఒక్క మ్యాచ్ కోసం మరో కిట్ ను ధరించడం జరగదని వెల్లడించింది. ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారం చేయడం సరికాదని బోర్డు హితవు పలికింది. 

బ్లూ... భారత క్రీడా రంగానికి సంబంధించిన రంగు... వరల్డ్ కప్ లోనూ ఈ రంగును మార్చడం జరగదు అని స్పష్టం చేసింది. భారత్ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు అక్టోబరు 14న తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.

  • Loading...

More Telugu News