Dhan Raj: 'బలగం' వేణు దారిలో మరో కమెడియన్!

Dhan Raj New Movie

  • దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు 
  • అదే బాటలో అడుగేస్తున్న ధన్ రాజ్ 
  • సముద్రఖని ప్రధాన పాత్రగా సినిమా 
  • దసరాకి మొదలుకానున్న షూటింగ్  

కమెడియన్ గా వేణు చాలా సినిమాలు చేశాడు. అయితే ఆ పాత్రలేవీ పెద్దగా గుర్తుండేవి కాదు. 'జబర్దస్త్' వేణుగానే ఆయన ఎక్కువ మందికి తెలుసు. ఇటీవలే ఆయన 'బలగం' సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నిర్మాతలకు పదింతలు లాభాలు తెచ్చిపెట్టింది. 

ఇప్పుడు వేణు బాటలోనే అడుగులు ముందుకు వేయడానికి మరో కమెడియన్ రెడీ అవుతున్నాడు. ఆ కమెడియన్ పేరే ధన్ రాజ్. ఆయన కూడా చాలానే సినిమాలు చేశాడు. అయితే గుర్తింపు వచ్చింది 'జబర్దస్త్' తోనే. ఈ మధ్య కాలంలో తనకి వేషాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆయన మెగా ఫోన్ పట్టనున్నాడనే టాక్ వినిపిస్తోంది. 

ధన్ రాజ్ ఒక కథను రెడీ చేసుకుని, 'విమానం' షూటింగు సమయంలో సముద్రఖనికి చెప్పాడట. ఆయనకి కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడని అంటున్నారు. కథ అంతా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. దసరాకి ఈ సినిమా షూటింగును లాంఛనంగా మొదలుపెడతారని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుందని చెబుతున్నారు. 

Dhan Raj
Samudrakhani
Venu
Tollywood
  • Loading...

More Telugu News