Vaishnavi Chaitanya: మరో లవ్ స్టోరీని సెట్ చేసుకున్న వైష్ణవీ చైతన్య!

Vaishnavi Chaitanya  New Movie

  • 'బేబి' సినిమాతో మెప్పించిన వైష్ణవి చైతన్య 
  • యూత్ లో విపరీతమైన క్రేజ్
  • మరోసారి ఆనంద్ దేవరకొండ జోడీగా 'డ్యూయెట్' 
  • దసరాకి పట్టాలెక్కనున్న ప్రాజెక్టు  

వైష్ణవీ చైతన్య .. ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. 'బేబి' సినిమాతో తను స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత ఆమెను వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి. తనకి నచ్చిన కథలను ఆమె ఎంచుకుంటూ వెళుతోంది. అలా తాజాగా ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగా 'డ్యూయెట్' అనే సినిమా చేయడానికి ఒప్పుకుందని టాక్.

ఆనంద్ దేవరకొండ హీరోగా మిథున్ అనే యువకుడు ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఇప్పటికే చాలామంది పేర్లను పరిశీలించారు. చివరికి వైష్ణవీ చైతన్య అయితేనే ఆ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టుగా సమాచారం. 

నిజానికి ఈ కాంబినేషన్లో 'బేబి' నిర్మాతలే మరో సినిమా చేయాలని భావించారు. కానీ సరైన కథ సెట్ కాకపోవడం వలన, అందుకు సంబంధించిన పనులలోనే ఉన్నారు. ఈలోగానే మిథున్ దర్శకత్వంలో ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Vaishnavi Chaitanya
Anand Devarakonda
Duet Movie
  • Loading...

More Telugu News