Varalakshmi Sharath Kumar: అతీంద్రియ శక్తులకు నిలయంగా మారిన 'మాన్షన్ 24'

Mansion 24 Web Series Update

  • ఓంకార్ రూపొందించిన 'మాన్షన్ 24'
  • ఉత్కంఠను పెంచుతున్న కంటెంట్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచే భారీతారాగణం 
  • ఈ నెల 17 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్   

ఊరికి దూరంగా ఒక బంగ్లా .. ఒకప్పుడు వైభవంగా కనిపించిన బంగ్లా అది. ఆ బంగ్లా గేటుదాటి సామాన్యులు వెళ్లలేని పరిస్థితి. అలాంటి బంగ్లా ఇప్పుడు పాడుబడిపోయింది. ఇప్పుడు ఆ బంగ్లాలో ఎవరూ ఉండటం లేదు. చీకటిపడితే అటు వైపు వెళ్లడానికి కూడా అందరూ భయపడతారు. అలాంటి బంగ్లాలోకి వెళ్లిన కాళిదాసు (సత్యరాజ్) తిరిగి రాలేదు. ఆయన ఏమైపోయాడనేది ఎవరికీ తెలియదు.

ఆ మాన్షన్ కి ఒక చరిత్ర ఉంది .. అందువలన దాని గురించి ఆలోచించడానికి కూడా ఎవరూ సాహసించరు. అందువలన తన తండ్రిని వెతకడానికి బయల్దేరిన కాళిదాసు కూతురుకి ఎవరి వైపు నుంచి ఎలాంటి సాయం లభించదు. ఆమెకి దెయ్యాలు .. భూతాలు ఉన్నాయనే విషయంపై నమ్మకం లేదు .. అందువలన భయం లేదు. అందువల్లనే తన తండ్రిని వెతుక్కుంటూ ఆ మాన్షన్ లోకి అడుగుపెడుతుంది. 

 అక్కడ అతీంద్రియ శక్తులు ఆమెను చుట్టుముడతాయి. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె తండ్రి ఏమయ్యాడు? అక్కడి నుంచి ఆమె బయటపడుతుందా? ఆ మాన్షన్ వెనకున్న చరిత్ర ఏమిటి? అనేది 'మాన్షన్ 24' పై ఆసక్తిని పెంచే అంశాలు. భారీ తారాగణంతో ఓంకార్ రూపొందించిన ఈ సిరీస్, ఈ నెల 17వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అందరిలో ఉత్కంఠను పెంచుతూ వచ్చిన ఈ సిరీస్, ఏ స్థాయిలో భయపెడుతుందనేది చూడాలి.

Varalakshmi Sharath Kumar
Sathyaraj
Rao Ramesh
Mansion 24
  • Loading...

More Telugu News