Sudheer Babu: రెండు వారాలకే రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి వచ్చేస్తుంది!

Mama Mascheendra movie update

  • ఈ నెల 6న విడుదలైన 'మామా మశ్చీంద్ర'
  • థియేటర్స్ నుంచి లభించని రెస్పాన్స్ 
  • ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 
  • 'ఆహా' నుంచి కూడా రానున్న డేట్

సుధీర్ బాబు వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. పాత్రకి తగినట్టుగా కనిపించడానికీ .. ఎంటర్టైన్ చేయడానికి తనవంతు కష్టపడుతున్నాడు. అయితే ఆయన ఆశించిన ఫలితానికి మాత్రం దూరంగానే ఉండిపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'మామా మశ్చీంద్ర' విషయంలో కూడా అలాగే జరిగింది. 

ఈషా రెబ్బా - మృణాళిని రవి కథానాయికలుగా నటించిన ఈ సినిమా, పెద్ద బ్యానర్లోనే ఈ నెల 6వ తేదీన విడుదలైంది. హర్షవర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అయితే ఈ కంటెంట్ ఆడియన్స్ కి ఎంత మాత్రమ్ కనెక్ట్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో పెద్దగా గ్యాప్ లేకుండానే ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'అమెజాన్ ప్రైమ్'వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కూడా. అయితే 'ఆహా'వారికి కూడా స్ట్రీమింగ్ హక్కులు ఉన్నట్టుగా సమాచారం. ఒకటి రెండు రోజులలోనే 'ఆహా' నుంచి కూడా స్ట్రీమింగ్ డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

More Telugu News