BCY Party: మద్యనిషేధం హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం.. వైజాగ్‌లో జగన్ ఫొటోకు మద్యంతో అభిషేకం

BCY Party Women Wing Rally Against YS Jagan

  • బీసీవై పార్టీ ఆధ్వర్యంలో కదంతొక్కిన మహిళలు
  • బీచ్‌రోడ్డులో నిరసన ర్యాలీ
  • జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు

మద్యాన్ని నిషేధిస్తానని అధికారంలోకి వచ్చి ఆపై ఆ హామీని తుంగలో తొక్కారంటూ విశాఖపట్టణంలో మహిళలు కదంతొక్కారు. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అంతేకాదు, మద్యంతో జగన్ ఫొటోకు అభిషేకం చేశారు. 

భారతీయ చైతన్య యువజన (బీసీవై) పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిన్న ఆర్కేబీచ్ రోడ్డులో నిరసన ర్యాలీ నిర్వహించిన మహిళలు ప్లకార్డులు పట్టుకుని జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

BCY Party
Visakhapatnam
RK Beach
YS Jagan
  • Loading...

More Telugu News