Balakrishna: ట్రైలర్ లో చూపించింది కొంతే... చూడాల్సింది సినిమాలో చాలా ఉంది: వరంగల్ లో బాలయ్య

Balakrishna attends Bhagavant Kesari trailer launch event
  • భగవంత్ కేసరి చిత్ర ట్రైలర్ విడుదల
  • వరంగల్ లో ట్రైలర్ విడుదల కార్యక్రమం
  • హాజరైన బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. టాలీవుడ్ దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 

ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ, తనకు వరంగల్ తో అనుబంధం ఉందని అన్నారు. దసరా నవరాత్రుల వేళ భద్రకాళి అమ్మవారే తనను ఇక్కడికి రప్పించారనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తాను ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో డైలాగులు చెప్పానని వెల్లడించారు. 

వీరసింహారెడ్డి తర్వాత ఏ సినిమా చేయాలా అనుకుంటున్న తరుణంలో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి కథ చెప్పాడని బాలకృష్ణ తెలిపారు. ట్రైలర్ లో చూపించింది కొంతేనని, చూడాల్సింది సినిమాలో చాలా ఉందని అన్నారు. 

శ్రీలీల ఇందులో తన కూతురిగా నటించిందని బాలయ్య వెల్లడించారు. తర్వాత ప్రాజెక్టులో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటానని చమత్కరించారు. ఈ మాటే తాను తన భార్య, కుమారుడితో చెప్పానని, దాంతో తన కుమారుడు... అదేంటి డాడీ... ఓవైపు నేను హీరోగా వస్తుంటే ఆమెను నువ్వు హీరోయిన్ గా తీసుకుంటావా? అని కోప్పడ్డాడని వివరించారు.
Balakrishna
Bhagavant Kesari
Trailer
Warangal
Tollywood

More Telugu News