Raviteja: హీరో రవితేజ అరుదైన ఘనత... వరల్డ్ కప్ మ్యాచ్ కు కామెంటరీ

Hero Raviteja turns commentator in world cup cricket match

  • టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించిన రవితేజ
  • చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా క్రికెట్ మ్యాచ్ లో లైవ్ కామెంటరీ చెప్పిన రవితేజ
  • మరే ఇతర హీరోకు దక్కని చాన్స్ రవితేజ సొంతం

ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా నేడు చెన్నైలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే, ఇవాళ ఓ విశేషం చోటుచేసుకుంది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ మ్యాచ్ కు కాసేపు కామెంటరీ చెప్పారు. కామెంటరీ బాక్సులో ఇతర వ్యాఖ్యాతలతో కలిసి అభిమానులకు వినోదం అందించారు. క్రికెట్ పై తన ఇష్టాన్ని వెల్లడించడంతో పాటు అనేక అంశాలను పంచుకున్నారు. 

కాగా, మరే హీరోకు లభించని అరుదైన ఘనత రవితేజకు లభించింది. ఓ వరల్డ్ కప్ మ్యాచ్ కు కామెంటరీ చెప్పిన సినీ కథానాయకుడు రవితేజనే. ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా క్రికెట్ మ్యాచ్ కు కామెంటరీ చెప్పినప్పటికీ అది ఐపీఎల్ టోర్నీ. ఇప్పుడు రవితేజ ఏకంగా ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో మైక్ పెట్టుకుని వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. 

రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం అక్టోబరు 19న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ క్రికెట్ లైవ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Raviteja
Commentator
Cricket Match
World Cup
Tollywood
  • Loading...

More Telugu News