Balakrishna: "బ్రో... ఐ డోంట్  కేర్..." బాలకృష్ణ 'భగవంత్ కేసరి' నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ విడుదల

Trailer from Bhagavant Kesari out now

  • బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో భగవంత్ కేసరి
  • షైన్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాణం
  • అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం

నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపుదిద్దుకుంటున్న భగవంత్ కేసరి చిత్రం నుంచి నేడు ట్రైలర్ రిలీజైంది. తెలంగాణ యాసలో బాలకృష్ణ పలికే డైలాగులు హైలైట్ గా నిలుస్తాయి. "ఎత్తిన చెయ్యి ఎవనిదో తెలియాలే, లేచిన నోరెవరిదో తెలియాలే, మిమ్మల్ని పంపిన కొడుకెవడో తెలియాలే...", "ష్... సప్పుడు జెయ్యాక్" అంటూ బాలయ్య నోటి వెంట డైలాగులు పవర్ ఫుల్ గా వెలువడడం ట్రైలర్ లో చూడొచ్చు. 

బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలతో నిండి ఉన్నాయి. శ్రీలీల పాత్ర కథకు కీలకమని ట్రైలర్ చెబుతోంది. "బ్రో... ఐ డోంట్ కేర్" అంటూ బాలయ్య పలికే డైలాగుతో ట్రైలర్ ముగుస్తుంది.

ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భగవంత్ కేసరి చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Balakrishna
Bhagavant Kesari
Trailer
Anil Ravipudi

More Telugu News