: నరేంద్ర మోడీకి మరో బాధ్యత
గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకీ మరో బరువైన బాధ్యతను తెచ్చిపెట్టింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచార కమిటీ బాధ్యతలను మోడీకి అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. గోవాలో జరిగే బీజపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీకి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించనున్నారు.