Tuscany: వరుణ్ తేజ్ పెళ్లి ఎక్కడో చెప్పేసిన ఉపాసన!

Upasana gives clarity on Varun Tej wedding destination
  • పెళ్లిపీటలు ఎక్కబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ
  • ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
  • ఒక్కచోట చేరిన మెగా కుటుంబ సభ్యులు
  • టస్కనీ... మేం వచ్చేశాం అంటూ ఉపాసన ట్వీట్
టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్, అందాలభామ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ ఫొటోలు సందడి చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్క చోట దర్శనమిస్తుండడంతో ఫ్యాన్స్ ఆనందం అంతాఇంతా కాదు. 

కాగా, వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి హైదరాబాదులో జరపడం కష్టమని, డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని నాగబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా, రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన ట్వీట్ తో వరుణ్ తేజ్ పెళ్లి ఎక్కడ అన్నది స్పష్టత వచ్చింది. 

ఇవాళ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కచోట చేరిన ఫొటోను ఉపాసన పంచుకున్నారు. టస్కనీ... మేం వచ్చేశాం అంటూ ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఇటలీ మధ్య ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా టస్కనీ ప్రఖ్యాతిగాంచింది. టస్కనీ రాజధాని ఫ్లోరెన్స్ అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా వర్ధిల్లుతోంది. ఇక్కడి ఎల్బా ప్రాంతంలో బీచ్ లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటి టస్కనీ ప్రాంతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లితో ఒక్కటి కానున్నారని తెలుస్తోంది.
Tuscany
Varun Tej
Lavanya Tripathi
Wedding Destination
Italy

More Telugu News