Jr NTR: ప్లై వుడ్ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్... వీడియో ఇదిగో!

Jr NTR acts in new ad film

  • అనేక టాప్ బ్రాండ్లకు ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్
  • తాజాగా గ్రీన్ ప్లై సంస్థతో ఒప్పందం
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఎన్టీఆర్ ప్లై వుడ్ యాడ్ వీడియో

టాలీవుడ్ లో అటు సినిమాలు, ఇటు వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉండే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ అనేక ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన నటించిన ఏదో ఒక యాడ్ టీవీ చానల్స్ లో తరచుగా ప్రసారమవుతుండడం చూస్తుంటాం. 

తాజాగా ఎన్టీఆర్ కొత్త యాడ్ లో నటించారు. ప్లై వుడ్ తయారీదారు గ్రీన్ ప్లై సంస్థతో ఈ యంగ్ టైగర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు గ్రీన్ ప్లై ప్లై వుడ్ కు ప్రచారం కల్పిస్తూ రూపొందించిన యాడ్ లోనూ ఎన్టీఆర్ నటించారు. ఈ యాడ్ వీడియోను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు. 

గ్రీన్ ప్లై ప్లై వుడ్ ఏమాత్రం పర్యావరణానికి హాని కలిగించని రీతిలో రూపొందించారని, వీటి నుంచి ఇంట్లోని వస్తువులపై ప్రభావం చూపించే ఎలాంటి ఉద్గారాలు విడుదల కావని ఎన్టీఆర్ వెల్లడించారు. ఇ-జీరో పేరిట రూపొందించిన ఈ గ్రీన్ ప్లై ప్లై వుడ్ కి స్వాగతం పలుకుదాం అని పిలుపునిచ్చారు.

Jr NTR
Ad Film
Greenply
Ply Wood

More Telugu News