Telangana: బాలకృష్ణ చర్చిస్తున్నారు: తెలంగాణలో టీడీపీ పోటీపై అచ్చెన్నాయుడు స్పందన

Atchannaidu responds on tdp contest in telangana
  • తెలంగాణలో పోటీపై త్వరలో నిర్ణయం ఉంటుందన్న అచ్చెన్నాయుడు
  • తెలంగాణలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడి
  • తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలో నిర్ణయం ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. తెలంగాణలోనూ పోటీ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. తమ పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు.

టీడీపీకి తెలంగాణలో మంచి ఓటు బ్యాంకు ఉంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో పోటీ చేసిన టీడీపీ జీహెచ్ఎంసీ పరిధిలో సత్తా చాటింది. 2019లో మాత్రం పోటీకి దూరంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణలోను పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తాము తెలంగాణలోనూ పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని అచ్చెన్నాయుడు చెప్పడం గమనార్హం.
Telangana
Balakrishna
Atchannaidu
Telugudesam

More Telugu News