Raja Singh: సెక్యూరిటీ సిబ్బందిని కొట్టిన హోంమంత్రిపై కేసు నమోదు చేస్తారా?: రాజాసింగ్

Can a case file on home minister asks Raja Singh

  • సెక్యూరిటీ చెంప ఛెళ్లుమనిపించిన మహమూద్ అలీ
  • పోలీసులను సేవకులుగా పరిగణిస్తున్నారన్న రాజాసింగ్
  • కేసీఆర్, డీజీపీలు చర్యలు తీసుకుంటారా అని ప్రశ్న

నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం కార్యక్రమంలో తన సెక్యూరిటీ సిబ్బందిపై హోంమంత్రి మహమూద్ అలీ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. సమయానికి ఫ్లవర్ బొకే అందించకపోవడంతో సెక్యూరిటీ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ... ఒక సాధారణ పౌరుడు చట్టాన్ని ఉల్లంఘిస్తే పోలీసులు వేగంగా స్పందిస్తారని... ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని చెప్పారు. పోలీసు అధికారిపై చేయి చేసుకున్న మహమూద్ అలీపై ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీలు చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. పోలీసులను వీఐపీల రక్షకులుగా కాకుండా... సేవకులుగా పరిగణిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News