Navadeep: హీరో నవదీప్కు ఈడీ నోటీసులు.. టాలీవుడ్ లో ప్రకంపనలు!

ED notices to Hero Navadeep in drugs case

  • టాలీవుడ్ ను మరోసారి షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
  • ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటూ నవదీప్ కు ఈడీ నోటీసులు
  • నైజీరియా డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై విచారించనున్న ఈడీ

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో మరోసారి ప్రకంపనలు పుట్టిస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ నవదీప్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఆయనకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. ఇప్పడు మూడోసారి నోటీసులు పంపారు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్ కు సంబంధాల విషయంలో ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. మరోవైపు గత నెల 23న మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీస్ ను నార్కోటిక్స్ పోలీసులు 6 గంటల పాటు విచారించారు. 

Navadeep
Tollywood
Drugs
Enforcement Directorate
  • Loading...

More Telugu News