Tamarind: చింతపండే కదా అని తీసి పారేయకండి.. ఆరోగ్య ప్రదాయిని
- రక్తపోటు నియంత్రణకు చింతపండు సాయం
- వ్యాధి నిరోధక శక్తి బలోపేతం
- జ్వర నివారిణిగా పనిచేసే గుణం
- పేగుల ఆరోగ్యానికి మేలు
చింతపండును వంటల్లో వినియోగించడం చాలా ఇళ్లల్లో చూస్తుంటాం. రుచి కోసం ఎక్కువ మంది ఈ పని చేస్తుంటారు. చింతపండును దూరం పెట్టే వారు కూడా ఉన్నారు. అయితే చింతపండును రుచి కోసం కాకుండా, మంచి ఆరోగ్య ప్రయోజనకారిగా చూడాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. న్యూట్రిషనిస్ట్ లవనీత్ బాత్రా ఇన్ స్టా గ్రామ్ లో చింతపండు వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒక పోస్ట్ పెట్టారు.
- చింతపండుతో పొటాషియం, మెగ్నీషియం తగినంత లభిస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో పెట్టడానికి సాయపడతాయి. ఫ్లావనాయిడ్స్ మాదిరి పాలీఫెనాల్స్ చింతపండులో ఉండడం వల్ల అవి కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి.
- వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసే ఎన్నో గుణాలు చింతపండులో ఉన్నాయి. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్, కెరొటీన్స్ చింతపండు ద్వారా లభిస్తాయి.
- చింత పండు పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. యాంటీ సెప్టిక్ గా, జ్వర నివారిణిగా పనిచేస్తుంది. పేగుల పనితీరు మెరుగ్గా ఉంచుతుంది. తిన్న ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది.
- చింతపండులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ట్యామరిండెనెల్ అనే కెమికల్ ఉండడం వల్ల యాంటీ ఫంగల్ గానూ పనిచేస్తుంది.