HP: ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లగలిగే ఆల్ ఇన్ వన్ పీసీ

HP launches the worlds first moveable all in one wireless PC

  • పోర్టబుల్ ఆల్ ఇన్ వన్ పీసీ ఇదేనని ప్రకటన
  • ఇంట్లో ఎక్కడ  ఉన్నా వినగలిగేలా అడాప్టివ్ సరౌండ్ సౌండ్
  • దీని ధర సుమారుగా రూ.75,000

ల్యాప్ టాప్ మాదిరిగా ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే విధంగా ఆల్ ఇన్ వన్ వైర్ లెస్ పీసీని హెచ్ పీ సంస్థ ఆవిష్కరించింది. ల్యాప్ టాప్ మాదిరే రీచార్జబుల్ బ్యాటరీతో వస్తుందిది. ప్రపంచంలో వెంట తీసుకెళ్లగలిగే మొదటి పీసీ ఇదేనని సంస్థ ప్రకటించింది. ఎన్వీ మూవ్ పేరుతో తీసుకొచ్చిన ఈ పీసీకి పై భాగంలో హ్యాండిల్ ఉంటుంది. దాన్ని చేత్తో పట్టుకుని సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనికి క్విక్ స్టాండ్ కూడా అమర్చి ఉంటుంది. దాంతో ఎక్కడ అయినా పెట్టేసి పని చేసుకోవచ్చు. ఇంటెగ్రేటెడ్ టచ్ పాడ్, ఫుల్ సైజ్ కీబోర్డుతో వస్తుందిది. 

24 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లేతో ఉంటుంది. ఇందులో అడాప్టివ్ సరౌండ్ సౌండ్ వ్యవస్థ ఉంది. అంటే ఇంట్లో మీరు ఎక్కడ ఉన్నారో గ్రహించి స్పేషియల్ ఆడియోను ఆన్ చేస్తుంది. దాంతో మీరున్న చోట నుంచే సౌండ్ వినొచ్చు. కంప్యూటర్ ముందే కూర్చోవాల్సిన అవసరం లేదు. సినిమాలు చూసే వారికి, గేమ్ లు ఆడేవారికి ఇది సౌకర్యాన్నిస్తుంది. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎల్పీడీడీఆర్5 మెమొరీ, 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర 900 డాలర్లు. మన కరెన్సీలో రూ.75,000.

  • Loading...

More Telugu News