Goregaon Fire Accident: ముంబైలోని ఏడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురి మృతి

7 Story Building Caught fire in Mumbai Goregaon 7 dead

  • గోరేగావ్ ప్రాంతంలో ఘటన
  • పార్కింగ్ ప్రాంతంలో చెలరేగిన మంటలు
  • పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా అగ్నికి ఆహుతి

ముంబైలోని గోరేగావ్‌లో ఈ తెల్లవారుజామున ఓ ఏడంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. భవనం వద్ద సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

భవనం పార్కింగ్ ప్రాంతంలో తొలుత మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. పార్కింగ్ ప్రాంతంలోని ఓ బట్టముక్కకు మంటలు అంటుకుని ఆ తర్వాత ఆ ప్రాంతమంతా విస్తరించినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News