Varalakshmi Sharath Kumar: ఉత్కంఠను పెంచుతున్న 'మాన్షన్ 24' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Mansion 24 Web Series Update

  • హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన 'మాన్షన్ 24'
  • ఓ పాడుబడిన మాన్షన్ చుట్టూ తిరిగే కథ 
  • భారీ తారాగణంతో రూపొందిన సిరీస్ ఇది 
  • ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్  


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా మరో హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఆ హారర్ థ్రిల్లర్ పేరే 'మాన్షన్ 24'. ఈ సిరీస్ కి సంబంధించిన అప్ డేట్స్ అంతకంతకూ అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. నిన్న వదిలిన ట్రైలర్ మరింత ఉత్కంఠను పెంచడంలో సక్సెస్ అయింది.కాళిదాసు కనిపించకుండా పోవడంతో, ఆయన భార్య మంచం పడుతుంది. తన తండ్రి ఆచూకీ తెలుసుకుని, తన తల్లి ప్రాణాలను కాపాడుకోవడం కోసం వాళ్ల కూతురు రంగంలోకి దిగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా 'మాన్షన్ 24'కి వెళ్లిన ఆమెకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది అసలు కథ. ఆ 'మాన్షన్' ఎవరిది? దాని వారసులు ఎవరు? అంతకుముందు అక్కడ ఏం జరిగింది? దాని చుట్టూ అల్లుకున్న కథేమిటి? అనేవి ఆసక్తికరమైన అంశాలు. వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు సత్యరాజ్ ..  రావు రమేశ్ .. బిందుమాధవి .. అవికా గోర్ .. తులసి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Varalakshmi Sharath Kumar
Sathyaraj
Rao Ramesh
Mansion 24

More Telugu News