Gulshan Devaish: జీ 5 ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ .. 'దురంగా 2'

Duranga 2 Web Series

  • క్రితం ఏడాది జీ 5లో వచ్చిన  'దురంగా'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో మెప్పించిన సిరీస్ 
  • ప్రధానమైన పాత్రలను పోషించిన గుల్షన్ దేవయ్య - ద్రష్టి ధామి  
  • త్వరలో స్ట్రీమింగ్ కానున్న సెకండ్ సీజన్

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ కథలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దాంతో ఈ తరహా కంటెంట్ ను అందించడానికి ఓటీటీ సంస్థలు మంచి ఉత్సాహాన్ని చూపుతున్నాయి. ఆల్రెడీ మంచి మార్కులు కొట్టేసిన సిరీస్ లకు కొత్త సీజన్లను యాడ్ చేస్తున్నారు. అలా 'జీ 5' ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి ఇప్పుడు 'దురంగా 2' సిరీస్ సిద్ధమవుతోంది.

'దురంగా' సిరీస్ 2022లో జీ5 ద్వారా పలకరించింది. సస్పెన్స్ తో కూడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కథకి అప్పుడు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక సైకో కిల్లర్ కొడుకు .. తాను ఎవరనే విషయాన్ని దాచిపెట్టి, ఒక పోలీస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంటాడు. వరుస హత్యలకు సంబంధించిన ఆ కేసును ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ డీల్ చేస్తూ ఉంటుంది. ఆ భార్య భర్తల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? అనేదే ఆ కథ.

ఫస్టు సీజన్ రేకెత్తించిన ఆసక్తి కారణంగా, సెకండ్ సీజన్ కోసం అంతా చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెకండ్ సీజన్ ను త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు జీ 5 నుంచి అప్ డేట్ వచ్చింది. గుల్షన్ దేవయ్య .. ద్రష్టి ధామి ప్రధానమైన పాత్రలను పోషించగా, అభిజిత్ .. దివ్య సేథ్ .. రాజేశ్ ఖట్టర్ .. జాకీర్ హుస్సేన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Gulshan Devaish
Drashti Dhami
Abhijith
Divya Seth
Duranga 2
  • Loading...

More Telugu News