Rajanikanth: 170వ సినిమా కోసం రంగంలోకి దిగిన రజనీ .. ఇక దీనిపైనే ఫ్యాన్స్ దృష్టి!
![Rajani New Movie Update](https://imgd.ap7am.com/thumbnail/cr-20231004tn651d5bf3ad7c8.jpg)
- సెట్స్ పైకి వెళ్లిన రజనీ 170వ సినిమా
- మరోసారి ఖాకీ డ్రెస్ లో కనిపించనున్న రజనీ
- ముఖ్యమైన పాత్రలలో అమితాబ్ ... రానా .. ఫహాద్ ఫాజిల్
- సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్
- వచ్చే ఏడాది మధ్యలో ప్రేక్షకుల ముందుకు
రజనీకాంత్ 169వ సినిమాగా వచ్చిన 'జైలర్' వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. 170వ సినిమాను లైకా బ్యానర్లో రజనీ చేస్తున్నారు. లైకా సంస్థలో నిర్మిస్తున్న సినిమా అంటే నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
త్రివేండ్రంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించగా, రజనీతో పాటు మంజువారియర్ కూడా హాజరయ్యారు. 'జైలర్' తరువాత పెద్దగా గ్యాప్ లేకుండానే రజనీ ఈ సినిమాతో రంగంలోకి దిగిపోవడం విశేషం. ఈ సినిమాలో ఆయన .. బూటకపు ఎన్ కౌంటర్ పై దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని అంటున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20231004fr651d5bf019de5.jpg)