Stock Market: ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 316 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 109 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- రెండున్నర శాతం వరకు నష్టపోయిన మారుతి షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ మార్కెట్లు కోలుకోలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 316 పాయింట్లు నష్టపోయి 65,512కి దిగజారింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 19,528 వద్ద స్థిరపడింది.
బజాజ్ ఫైనాన్స్ (2.04%), ఎల్ అండ్ టీ (1.68%), టైటాన్ (1.50%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.71%).
మారుతి (-2.46%), ఎన్టీపీసీ (-1.83%), టాటా మోటార్స్ (-1.59%), సన్ ఫార్మా (-1.48%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.23%).