Ram Charan: తన కొత్త నేస్తం 'బ్లేజ్' తో రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో!

Ram Charan introduced his new friend Blaze

  • రామ్ చరణ్ ఫామ్ హౌస్ లో కొత్త గుర్రం
  • మేలుజాతి అశ్వం బ్లేజ్ ను అందరికీ పరిచయం చేసిన రామ్ చరణ్
  • గతంలో పోలో టీమ్ నిర్వహించిన గ్లోబల్ స్టార్
  • ఇప్పటికీ గుర్రాలతో అనుబంధం 

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  తన కొత్త నేస్తాన్ని అందరికీ పరిచయం చేశారు. బ్లేజ్... నా కొత్త ఫ్రెండ్ అంటూ ఓ మేలుజాతి గుర్రం ఫొటోను పంచుకున్నారు. ఆ అశ్వం పక్కనే రామ్ చరణ్ నిలుచుని ప్రేమగా దాన్ని నిమురుతుండడం చూడొచ్చు. 

రామ్ చరణ్ అశ్వప్రేమికుడన్న సంగతి తెలిసిందే. ఆయనకు గుర్రాలంటే ఎంతో ఇష్టం. గతంలో తన పేరిట ఆర్సీ హైదరాబాద్ పోలో క్లబ్ ను కూడా రామ్ చరణ్ నిర్వహించారు. గుర్రాలతో ఆడే పోలో క్రీడలో ఆయన టీమ్ అనేక చాంపియన్ షిప్ పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. రామ్ చరణ్ స్వతహాగా మంచి హార్స్ రైడర్. 'మగధీర' చిత్రంలో అలవోకగా గుర్రంపై స్వారీ చేయడం ఆయన అభిరుచికి అద్దం పడుతుంది. 

కాగా, ఇప్పటికీ రామ్ చరణ్ కు గుర్రాలతో అనుబంధం కొనసాగుతోంది. ఆయన తన ఫామ్ హౌస్ లో పలు ఉత్తమ జాతి అశ్వాలను పోషిస్తున్నారు. తాజాగా వాటిలో 'బ్లేజ్' కూడా వచ్చి చేరింది.

More Telugu News