Lulu Mall: లులూ మాల్ కు పోటెత్తుతున్న కస్టమర్లు... స్టాల్స్ మొత్తం ఖాళీ
![Hyderabad Lulu mall flooded with customers](https://imgd.ap7am.com/thumbnail/cr-20231003tn651be59fbfdbc.jpg)
- కేపీహెచ్ బీ కాలనీలో ఏర్పాటైన లులూ మాల్
- మాల్ లో 75 దేశీ, విదేశీ బ్రాండెడ్ స్టోర్లు
- రూ. 500 కోట్లతో మాల్ ఏర్పాటు
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ఇటీవలే ప్రారంభమైన లులూ మాల్ కు కస్టమర్లు పోటెత్తుతున్నారు. ఈ మాల్ దెబ్బకు జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మెయిన్ రోడ్డు మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు ఇసుకవేస్తే రాలనంతగా వస్తున్న కస్టమర్లను చూసి మాల్ యాజమాన్యం సైతం విస్తుపోతోంది. బైక్ లు, కార్లు పెట్టడానికి కూడా పార్కింగ్ దొరకడం లేదు. మాల్ లోని స్టాల్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి. ఎక్కడ చూసినా చాకొలేట్ కవర్లు, ఫుడ్ కవర్లు, ఖాళీ కూల్ డ్రింక్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి.