Tabu: ఈ వారం ఓటీటీ సినిమాలు .. సిరీస్ లు ఇవే!

- ఈ నెల 5న నెట్ ఫ్లిక్స్ లో టబూ 'ఖుఫియా' స్ట్రీమింగ్
- అదే రోజున అందుబాటులోకి మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి
- 6వ తేదీన హాట్ స్టార్ లో 'లోకి' .. అమెజాన్ ప్రైమ్ లో 'ముంబై డైరీస్'
- అదే రోజున జీ 5లో 'గదర్ 2' .. 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో 'OMG'
ఈ వారం ఓటీటీ సెంటర్స్ లో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు .. సిరీస్ లే అడుగు పెడుతున్నాయి. 'నెట్ ఫ్లిక్స్' లో ఈ నెల 5వ తేదీ నుంచి ' మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' స్ట్రీమింగ్ కానుంది. వంశీకృష్ణ - ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాలో, అనుష్క - నవీన్ పోలిశెట్టి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇక ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ లో 'ఖుఫియా' అందుబాటులోకి రానుంది. టబూ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ ఇది.


